
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు, భద్రత ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులతో సమీక్షించినట్లు చెప్పారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా భద్రతపరంగా కలెక్టర్, ఎస్పీలతో చర్చించి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక.. రథసప్తమి రోజు వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు అనుమతించబోమని.. కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుందన్నారు ఈవో శ్యామలరావు.తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకలకు గతంలో కంటే పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు తిరుపతి ఎస్పీ హర్షవర్థన్రాజు. గతంలో ఎక్కడెక్కడ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు పలు సూచనలు చేశారు.
