హిందూ సంప్రదాయాల ప్రకారం, నందికేశ్వర లేదా నందిదేవ అని పిలవబడే ఎద్దుని శివుడి వాహనంగా పూజిస్తారు. నందీశ్వరుడు కైలాస సంరక్షక దేవత కూడా. అయితే చాలా మంది నంది విగ్రహాన్ని శివాలయంలో అలంకరణగా ఉంచుతారు అనుకుంటారు. కానీ శివుడి ఆలయంలో నంది విగ్రహం పెట్టడం వెనుక పెద్ద కారణం ఉన్నదంట. శివుడికి అత్యంత సన్నిహితుడు, నందీశ్వరుడు. అందువలన ఆయన ఎప్పుడూ గర్భగుడి వైపు కూర్చొని , శివుడి విగ్రహం పై దృష్టి పెడుతుంటాడు. ఆయనన ద్వారపాలకుడిగా, శారీకంగా, ఆధ్యాత్మికంగా శివుడికి దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టి, శివాలయాల్లో తప్పకుండా నందివిగ్రహం పెడుతారంట.
