
షాపింగ్ మాల్ సినిమా ద్వారా పరిచయమైన, ఈ బ్యూటీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడుకు వరసగా ఆఫర్స్ రావడంతో బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్‌తో నటించే అవకాశం వచ్చింది.
రీసెంట్గా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఓ వైపు సినిమాల్లో బీజీగా ఉంటూ ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
తాజాగా ఈ అమ్మడు సన్నని చీరలో తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టేలా చేసింది.
లైట్ పింక్ కలర్ చీరలో హెయిర్ లీవ్ చేసి , సింపుల్ లుక్‌లో ట్రెడిషనల్‌గా రెడీ అయ్యి ఫొటోలకు ఫోజులిచ్చింది.
ఇందులో ఈ ముద్దుగుమ్మ చూడటానికి చాలా చక్కగా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.