
లావణ్య, రాజ్ తరుణ్ రచ్చ మళ్లీ మొదలైంది.. రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడని ఇప్పటికే లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. తాజాగా లావణ్య ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. లావణ్య ఇంటి ముందు రాజ్ తరుణ్ తల్లిదండ్రుల నిరసన చేశారు. తమను ఇంట్లోకి అనుమతించడం లేదని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అయితే ఒక 15 మందిని రాజ్ తరుణ్ తలదండ్రులు తీసుకొచి దాడి చేశారని లావణ్య ఆరోపిస్తుంది.
ఇది కూడా చదవండి : Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ఎమోష్నలైన ప్రభాస్
లావణ్య మాట్లాడుతూ.. మధ్యాహ్నం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఒక 15 మందిని తీసుకొచ్చారు. నన్ను జుట్టు పట్టుకుని ఇంట్లో నుండి బయటకి తీసుకొచ్చారు. మా ఇంటి ముందు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. మా తమ్ముడి పై క్రికెట్ బ్యాట్ తో దాడి చేశారు. రాజ్ తరుణ్ ప్రోద్బలంతోనే వాళ్ల పేరెంట్స్ మనుషులను తీసుకొచ్చి ఈ దాడి చేయించారూ.. రాజ్ తరుణ్ ను ఇక వదిలి పెట్టను, కోర్ట్ మెట్లు ఎక్కిస్తా.. 15 సంవత్సరాల నుండి నేను ఈ ఇంట్లో ఉంటున్నాను.. అంటూ లావణ్య చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్
రాజ్ తరుణ్ పేరెంట్స్ మాట్లాడుతూ.. “లావణ్య ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్ ది. రాజ్ తరుణ్ కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు. రాజ్ తరుణ్ ని ఇక్కడ ఉండనివ్వడం లేదు, మమల్ని కూడా ఉండనివ్వలేదు. మేము ఒక ఇంట్లో, రాజ్ తరుణ్ ఇంకో ఇంట్లో ఉంటున్నాం. రెండు ఇళ్లకు రెంట్ రాజ్ తరుణ్ కడుతున్నాడు. సొంత ఇల్లు ఉండి కూడా మేము రెంట్ లు కట్టుకుంటూ బయట ఎందుకు ఉండాలి.? మేము నడవలేని స్థితిలో ఉన్నాము. నా కొడుకు సినిమా లు తీసి కట్టుకున్న ఇల్లు ఇది. లావణ్య మా ఇంటిని పాడు చేస్తుంది.. అసాంఘిక చేష్టలు జరుగుతున్నాయి.. మా ఇల్లు మాకు కావ్వాలి” అంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :తమన్నాను చూసి కుళ్ళుకుంటున్న హాట్ బ్యూటీ.. అలాంటి పోస్ట్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ సీరియస్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.