
మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ పరువునష్టం దావాపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సమంత విడాకులపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విడాకుల అంశంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆయన పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ నెల 21లోపు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
