

ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామానికి చెందిన గురుమూర్తికి, 13 ఏళ్ల క్రితం వెంకటమాధవితో వివాహమైంది. గురుమూర్తి ఆర్మీలో జవాన్‌గా పని చేసి నాయక్ సుబేదార్‌గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్‌భాగ్ డీఆర్డీవోలో కాంట్రాక్ట్ పద్దతిలో భద్రతా విభాగంలో పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా అతను మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. విషయం మాధవికి తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో గురుమూర్తి తన భార్యను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. సంక్రాంతి సందర్భంగా తన ఇద్దరు పిల్లలను హైదరాబాద్‌లోనే ఉండే తన సోదరి ఇంటికి పంపించాడు. ఈ నెల 15న భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహంతో భార్య తలను గోడకేసి కొట్టాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన ఓ వెబ్ సిరీస్‌లో ఉన్నట్లుగా మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకువెళ్లి ముక్కలుగా నరికాడు.