
మానుషి చిల్లర్ ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంత. తన బ్యూటీ తో ఎంతో మంది మదిని దోచుకున్న ఈ చిన్నది వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది.
బాలీవుడ్ సామ్రాట్ మూవీతో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ హిట్ అందుకోలేదు. అయినా కూడా ఈ అమ్మడుకు వరసగా అవకాశాలు తలుపుతట్టాయి.
దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ, ఈ బ్యూటీకి ఒక్క హిట్ కూడా పడలేదు. దీంతో ఈ అమ్మడు గ్రాఫ్ కొద్ది కొద్దిగా తగ్గిపోయింది.
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఈ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు ఈ చిన్నదానికి.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా బ్లూ కలర్ లెహెంగాలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ చాలా అందంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.