

విమానం టికెట్ బుక్ చేస్తున్న సమయంలోనే ప్రయాణికుల ఫోన్ కి “జర్నీ పాస్” పంపిస్తారు. ఈ డిజిటల్ జర్నీ పాస్ విమానం టేకాఫ్ సమయానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆటోమేటిగ్గా అప్డేట్స్ రూపంలో అందిస్తుంది. విమానాశ్రయంలోని ఫేషియల్ రికగ్నిషన్ స్కాన్ ప్రయాణికుడిని స్కాన్ చేసి అతని వివరాలను విమానసంస్థకి నేరుగా అందిస్తుంది. దీంతో డాక్యుమెంట్లు వెంటబెట్టుకు వెళ్లాల్సిన అవసరం పూర్తిగా తగ్గుతుంది. చెక్ ఇన్ అవసరం కూడా ఇకపై ఉండదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలలో కొత్తగా మొబైల్ పాస్‌పోర్ట్ రీడర్స్ ఇంకా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌లను ఏర్పాటుచేయనున్నారు. ప్రయాణికుల వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యత ఇస్తూ… ప్రతీ 15 సెకన్ల తర్వాత ఫేషియల్ రిక్నగిషన్ స్కాన్లు.. సమాచారాన్ని ఎరేజ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. డేటా భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.