దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్పీ్కర్ మూడు నెలలో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
పార్టీ పిరాయింపు కేసుకు సంబంధించి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకటరావులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదని కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరి పిటిషన్లపై పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసులో స్పీకర్ నిర్ణయాధికారంపై విచారణ జరిపింది. విచారణ సందర్భంగా స్పీకర్ నిర్ణయానికి కాల పరిమితి విధించే విషయంలో ఎలాంటి తీర్పులు అసెంబ్లీ సెక్రటరీ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింగ్వి కోర్టుకు తెలిపారు. ఇక స్పీకర్ తరయపు న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపిస్తూ స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాలను కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదని, ఒకసారి స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకే జ్యూడిషియల్ సమీక్ష చేయొచ్చని ఆయన తెలిపారు.
ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం సరికాదని ముకుల్ రోహిత్గి పేర్కొన్నారు. ఈ క్రమంలో రీజనబుల్ టైమ్ అంటే ఏంటి? నాలుగేళ్లు గడిచినా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే చూస్తూ ఉండాలా..? అంటూ గత విచారణ సందర్భంగా స్పీకర్ తరపు న్యాయవాదులను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇదిలా ఉండగా తాము పార్టీ మారలేదని బిఆర్ఎస్లోనే ఉన్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఇరువైపు వాదలను విన్న కోర్టు కాసేపట్లో తీర్పును వెలువరించనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
