బంగ్లాదేశ్లో అరాచక శక్తుల హింసకు అడ్డుకట్ట పడటం లేదు. హిందువులపై దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మైమెన్సింగ్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బజేంద్ర బిశ్వాస్పై నూమన్ మియాన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలైన బిశ్వాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
