కాగా, ఇప్పుడు మనం మాఘ మేళా ఆచారాల గురించి తెలుసుకుందాం. మాఘ మేళాలో ప్రధాన ఆచారం సంగమంలో పవిత్ర స్నానం చేయడం. ఈ రోజుల్లో తెల్లవారు జామున, భక్తులు అందరూ ప్రార్థనలు, జపాలు చేస్తూ, నదిలోకి వెళ్లి పవిత్ర స్నానం ఆచరిస్తారు. ఇక ఈ సమయంలో ప్రయాణికులు, భక్తులు, నాగ సాదువులు, అఘోరాలు, వివిధ రకాల సాదువులు ఊరేగింపులో కూడా పాల్గొనవచ్చు.
