
పుష్పా-2 పాటకు కేజ్రీవాల్ స్టెప్పులు వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఢిల్లీలోని ఓ హోటల్లో హర్షిత, సంభవ్ వివాహ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తన సతీమణితో కలిసి డాన్స్ చేశారు. హీరో అల్లు అర్జున్, రష్మిక మందన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్పా-2 సినిమాలోని సూసేఖి అనే హిందీ వెర్షన్ పాటకు కేజ్రీవాల్ దంపతులు స్టెప్పులు వేశారు. వీరే కాకుండా ఈ వేడుకలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా డాన్సులు వేశారు. వీరిద్దరి డాన్సులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని వార్తల కోసం :