యూకేలోని డర్హమ్‌లో నివాసముంటున్న 34 ఏళ్ల లీ రోజర్స్ దాదాపు రెండు వారాలుగా పంటి నొప్పితో బాధపడుతోంది. నొప్పి భరించలేనంతగా మారడంతో.. ఆమెను కుటుంబీకులు అంబులెన్స్‌లో నార్త్ డర్హమ్ యూనివర్సిటీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడున్న వైద్యులు ఆమెకు CT స్కాన్ చేయించగా.. కారణం ఏంటన్నది అంతుచిక్కలేదు. కొద్దిరోజుల తర్వాత ఆమె విగతజీవిగా మారింది. దీంతో ఆ మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు డాక్టర్లు. ఆమె మరణానికి గల అసలు కారణం బయటపడటంతో.. అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ మహిళ మరణానికి అసలు కారణం పంటి నొప్పి కాదు.. అలెర్జీ అని CT స్కాన్‌లో తేలింది. సదరు అలెర్జీ ఆమెకు నోటి నుంచి ఒళ్లంతా పాకిందని.. అదొక ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్స సమయంలో ఆమెకు అయోడిన్ కలిగిన కాంట్రాస్ట్ డై ఇచ్చారు వైద్యులు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆమె విగతజీవిగా మారింది. ఈ సమయంలో ఆమెను కాపాడటానికి 90 నిమిషాల పాటు శ్రమించారు వైద్యులు. కానీ చివరికి ఆమె చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించాల్సి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. కోర్టులో ఆమె మృతి అసాధారణమైనదిగా.. దురదృష్టకరంగా పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం :
ప్రధాని మోదీ తీసుకునే సూపర్ ఫుడ్ ఇదే.. లాభాలు తెలిస్తే షాకవుతారు!
చివరి అమృత్‌స్నాన్.. ప్రయాగ్‌రాజ్‌కు కోటి మందికి పైగా.. వీడియో!
ఫంక్షన్ హాల్లో కాదు పంట పొలంలో పెళ్లి.. కారణమేంటంటే.. వీడియో
ఆ గ్రహశకలంతో భూమికి తప్పిన ముప్పు.. ఏం జరిగిందంటే..!వీడియో
