
ఈ మధ్య కాలంలో పలు డాన్స్ షోలు మరీ మితిమీరుతున్నాయి. ఐకానిక్ సాంగ్స్ కు అర్ధం పర్థం లేకుండా డాన్స్ చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. ఎమోషనల్ సాంగ్స్ కూడా డాన్స్ పేరుతో కొంతమంది స్టంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఇలాంటి డాన్స్ పర్ఫామెన్స్ లపై , షోల పై ఎన్నో ట్రోల్స్ మీమ్స్ వచ్చాయి. తాజాగా ఓ డాన్స్ షోలో ఐకానిక్ సాంగ్ ను చెడగొట్టారని మండిపడుతున్నారు నెటిజన్స్. అంతే కాదు ఆ సాంగ్ కు డాన్స్ బాగా చేశారని ఆభినందించడం కూడా ఇప్పుడు చర్చాంశనీయం అయ్యింది. తెలుగు సినీ చరిత్రలో కల్ట్ క్లాసిక్ సాంగ్ గా నిలిచినా వాటిలో ఆహా నా పెళ్లి అంట సాంగ్ ఒకటి. ఈ పాటలో మహానటి సావిత్రి అద్భుతంగా డాన్స్ చేశారు. డాన్స్ మాత్రమే కాదు ఆమె అభినయం ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది.
ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్
ఇప్పటికీ ఆ సాంగ్ వింటే మహానటి సావిత్రి హావభావాలు కళ్ళల్లో మెదులుతాయి. అలాంటి సాంగ్ కు రీసెంట్ గా ఓ డాన్స్ షోలో అసభ్యకరంగా స్టెప్పులేశారు. పొట్టి డ్రెస్‌లో బెల్లీ డ్యాన్స్‌తో పాటను చెడగొట్టేశారు. దాంతో తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. అంతే కాదు ఆ డాన్స్ షోకు గెస్ట్ గా వెళ్లిన టాలీవుడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఆ డాన్స్ పై కొత్తగా ఉందంటూ ప్రశంసించారు. దాంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. దాంతో ఈ వివాదం పై దర్శకుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సారంగపాణి జాతకం అనే సినిమా చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
ఇది కూడా చదవండి :పూరి సినిమాలో క్రేజీ బ్యూటీ.. విజయ్ సేతుపతికి జోడీగా బాలయ్య హీరోయిన్
ఈ ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా అలాంటి టీవీ షోలకు వెళ్ళినప్పుడు సొంత అభిప్రాయాలను తెలిపే స్వేచ్ఛ ఉండదు. వాళ్ళు కష్టపడి డాన్స్ చేస్తే అభినందించాలి. ఆ అమ్మయి నిజంగా చాలా కష్టపడి డాన్స్ చేసింది. కాకపోతే ఆ పాటకు అలాంటి డ్యాన్స్ చేయొచ్చా? లేదా.? చర్చనీయాంశం. ఇక మేము ఇలాంటి షోలో ఒక సందర్భంలో నవ్విన దాన్ని కట్ చేసి మరో సందర్భంలో నవ్వినట్టు ఎడిట్ చేసి చూపిస్తారు. అయితే ఇలా షోలకు వెళ్ళినప్పుడు సభామర్యాద పాటించి వారిని విమర్శించకూడదు. పైగా నాకు బెల్లి డాన్స్ అంటే ఇష్టమే.. కానీ ఆ పాటకు అది సెట్ అవ్వలేదని నాకూ అనిపించింది. కానీ అక్కడ అది చెప్పలేం.. అన్నారు ఇంద్రగంటి. గతంలోనూ ఇలా కర్మకాలి నవ్వి వివాదంలో ఇరుక్కున్నా అని చెప్పుకొచ్చారు ఇంద్రగంటి.
ఇది కూడా చదవండి :నాన్న స్టార్ హీరో.. అమ్మ క్రేజీ హీరోయిన్.. కూతురికి మాత్రం ఒక్క హిట్ లేదు.. ఈ చిన్నది ఎవరో తెలుసా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.