వర్షాకాలంలో పాములు, తేళ్లు వంటి ప్రమాదకరమైన జీవులు పొదలు, వాటి బొరియల్లోంచి బయటకు రావడం సర్వసాధారణం. ఆహారం, వెచ్చటి ప్రదేశం కోసం వెతుక్కుంటూ అవి అప్పుడప్పుడూ ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తాయి. అలాంటి పరిస్థితిలో గ్రామాలు, శివార్లు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. వర్షం కారణంగా పాములు ఇళ్లలోకి దూరి మన బూట్లూ, హెల్మెట్లలోకి కూడా ప్రవేశించి దాక్కుని కూర్చునే సందర్భాలు తరచుగా మనం సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉంటాం. అలాంటి పరిస్థితిలో ఎవరైనా చూడకుండా ఆ హెల్మెట్ లేదా బూట్లు ధరించినప్పుడు పాముకాటుకు గురి కావాల్సి వస్తుంది. అందుకే వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలని అంటారు. ఇందుకు ఉదాహరణగా బెంగళూరులో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ 41 ఏళ్ల వ్యక్తి తన బూటులో దాగి ఉన్న పాము కాటుకు గురై మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…
బెంగళూరు శివార్లలోని తాలూక్ బన్నేర్ఘట్టలోని రంగనాథ్ లేఅవుట్లో క్రోక్స్ చెప్పుల్లో దాగి ఉన్న విష సర్పం కాటుకు గురై ఒక టెక్కీ మరణించాడు. మంజు ప్రకాశ్ టీసీఎస్ లో జాబ్ చేస్తున్నాడు. అతను 2016లో జరిగిన ఓ బస్సు ప్రమాదం కారణంగా తన పాదాల స్పర్శను కోల్పోయాడు. అప్పటి నుంచి అతని కాళ్లకు ఎలాంటి స్పర్షతెలియదు..అయితే, మంజు ప్రకాశ్ మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో చెరకు రసం తీసుకురావడం కోసం దుకాణానికి వెళ్లాడు. అందుకోసం అతడు ఇంటి నుంచి బైటకు వెళ్లేటప్పుడు చెప్పులు ధరించాడు. అదే అతడు చేసిన పెద్ద తప్పు. పాపం తనకు తెలియదు ఆ చెప్పులు ధరిస్తే తన ప్రాణం పోతుందని..
గమనించుకోకుండా మంజు ప్రకాశ్ ధరించిన చెప్పులో ఒక విషపూరిమైన పాము పిల్ల దాగి వుంది. దాన్ని అతను గమనించలేదు. ఆ పాము అతన్ని పలుమార్లు కాటువేసింది. కానీ, అతడి కాలికి స్పర్ష లేకపోవడం వల్ల అతడికి నొప్పి తెలియలేదు. కానీ, గంటల వ్యవధిలో అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతను తన రూమ్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, తన తండ్రి ఇంటి బయట విప్పేసిన చెప్పులో రక్తపు మరకలు, చనిపోయిన పాము పిల్లను గమనించాడు. వెంటను తన కొడుకు గదికి వెళ్లి చూడగా అతను అపాస్మరక స్థితిలో పడివున్నాడు..నోటి నుండి నురగలు వస్తుండటం చూసి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు మరణించినట్టుగా వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
