
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఉరుములతో కూడిన కుండపోత వాన కురిసింది.. ఈ క్రమంలో తెల్లవారుజామున ఓ భవనం కూలి నలుగురు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.. నాలుగు అంతస్థుల భవనం కూలి నలుగురు మరణించిన ఈ దుర్ఘటన తూర్పు ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. తెల్లవారుజాము 3గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది.. వెంటనే సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. అక్కడికి చేరుకుని రెస్క్యూను ప్రారంభించాయి.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.. ఇప్పటివరకు 14 మందిని రక్షించారు.. శిథిలాల కింద మరో 10మంది చిక్కుకున్నట్లు పేర్కొంటున్నారు.
#WATCH | Delhi: Sandeep Lamba, Additional DCP, North East District, says, ” The incident took place at 3 am in the morning. 14 people were rescued, but four among them succumbed…it was a four-storey building…rescue operation is underway. 8-10 people are still feared trapped” https://t.co/lXyDvOqwSY pic.twitter.com/F1BTiUZYcp
— ANI (@ANI) April 19, 2025
భవనం ఎలా కూలిందనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం అందలేదు. ఈ సంఘటన తెల్లవారుజామున 3 గంటలకు జరిగిందని నార్త్ ఈస్ట్ జిల్లా అదనపు డీసీపీ సందీప్ లాంబా తెలిపారు. 14 మందిని రక్షించారని.. నలుగురు మరణించారని పేర్కొన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఇంకా 8-10 మంది చిక్కుకున్నట్లు పేర్కొంటున్నారని.. తెలిపారు. డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర అత్వాల్ మాట్లాడుతూ.. ఉదయం ఇల్లు కూలిపోయినట్లు తమకు సమాచారం అందిందని .. వెంటనే తాము సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ప్రారంభించామన్నారు.
#WATCH | Delhi: Mustafabad building collapse caught on camera.
As per Delhi Police, “Among the 10 people who were taken out, 4 succumbed. Rescue operations still underway”
(Source – local resident) https://t.co/lXyDvOpZ3q pic.twitter.com/NlknYWODRR
— ANI (@ANI) April 19, 2025
మధు విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయి ఒకరు మరణించగా, ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..