
జున్ను పాలు … గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి ఈ పాల గురించి ఎక్కువగా తెలిసి ఉంటుంది. ఆవు లేదా గేదె ప్రసవించినప్పుడు తొలి మూడు, నాలుగు రోజు వచ్చే పాలను జున్ను పాలు అంటారు. వీటితో తయారు చేసేదే జున్ను. కానీ, ఈ జున్ను తినటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. వాస్తవానికి పాల కంటే జున్నులోనే అధిక మోతాదులో పోషక విలువలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జున్ను తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరని చెబుతున్నారు. అవేంటంటే…
జున్ను పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జున్నులోని ప్రోటీన్ కండరాల నిర్మాణానికి, నిర్వహణకు ఎంతో సహాయ పడుతుంది. జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి, జున్ను తింటే జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనితో ఎముకలు, దంతాల బలానికి దోహదపడుతుంది. కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జున్నులో సమృద్ధిగా లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును, మెరుగుపరికి మలబద్దకం, అజీర్తి సమస్యలను తొలగిస్తుంది.
జున్నులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు అధికం. జున్నులోని ప్రోటీన్ కండరాల నిర్మాణానికి , నిర్వహణకు అవసరం. కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జున్నులో విటమిన్లు A, B12 , K ఉంటాయి. ఖనిజాలలో పొటాషియం, మెగ్నీషియం , జింక్ కలిగి ఉంటాయి. తరచూ జున్ను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జున్నులో కొంత కొవ్వు, క్యాలరీలు ఉంటాయి.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..