
ఇంట్లో పండుగలు, పర్వదినాలు, ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కాదు ఉపవాసాల సమయంలో కూడా తప్పని సరిగా తయారుచేసే సాంప్రదాయ వంటకం పాయసం. దీనిని సేమ్యాతో, బియ్యంతో తయారు చేస్తారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చెక్కరతో తయారు చేసే ఖీర్ ను ఇష్టంగా ఉన్న తినడానికి ఆలోచిస్తున్నారు. అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన ఖీర్ తినాలనుకుంటే.. మఖానా ఖీర్ గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే.. ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు చాలా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
మఖానా ఖీర్ బరువు తగ్గడానికి , జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని చక్కెర లేకుండా తయారు చేస్తే, మధుమేహ రోగులతో పాటు ఆరోగ్యం అంటే అక్కర ఉన్నవారికి, ఉపవాసం చేసే వారికి బెస్ట్ డెజర్ట్. ఈ రోజు షుగర్ లేకుండా మఖానా ఖీర్ తయారు చేసే పద్ధతి.. ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
మఖానా ఖీర్ (చక్కెర లేకుండా) తయారీకి రెసిపీ
- మఖానా – ఒక కప్పు
- ఖర్జూరాలు- రుచికి సరిపడా
- పాలు – అర లీటర్
- యాలకుల పొడి – కొంచెం
- బాదం-
- జీడిపప్పు
- పిస్తా
- నెయ్యి
తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి.. పాన్ పెట్టి అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి.. మఖానాను వేసి 5-7 నిమిషాలు తక్కువ మంట మీద వేయించాలి. మఖానాలు కరకరలాడే వరకూ వేయించి.. స్టవ్ మీద నుంచి దింపి వాటిని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత వాటిలో కొన్నిటిని మిక్సి పట్టుకోవాలి. దీని తరువాత ఖర్జూరాలను తీసుకుని గోరువెచ్చని నీటిలో 15 నిమిషాలు నానబెట్టి.. తర్వాత ఖర్జూరాలను మిక్సిలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి.. పాలు పోసి తక్కువ మంట మీద 10 నిమిషాలు మరిగించాలి.. కొంచెం పాలు చిక్కబడిన తర్వాత.. ఇప్పుడు పాలలో మఖానా పేస్ట్, మఖానా వేసి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఖర్జూర పేస్ట్ వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమానికి బాదం, జీడిపప్పు, పిస్తా, యాలకుల పొడి వేసి కలపాలి. రెండు నిమిషాలు ఉడికించండి. అంతే మఖానా ఖీర్ రెడీ.
ఇవి కూడా చదవండి
మఖానా ఖీర్ తో అద్భుతమైన ప్రయోజనాలు
ఫైబర్ అధికంగా ఉంటుంది, జీర్ణక్రియను బలపరుస్తుంది
తామర గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకం నుంచి ఉపశమనం ఇవ్వడంలో సహాయపడుతుంది. రోజూ మఖానా ఖీర్ తింటే పేగు ఆరోగ్యాన్ని బలపరుస్తుంది.
మధుమేహం, బరువు తగ్గించడంలో ప్రయోజనకరమైనది
మఖానా ఖీర్ లో చక్కెరకు బదులుగా ఖర్జూరాలను ఉపయోగిస్తారు. ఇది సహజమైన తీపిని ఇస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. మఖానాలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గించే ఆహారంగా ఇది ఒక అద్భుతమైన ఎంపిక.
ఎముకల బలం కోసం
కమలం గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది. వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులు, ఆస్టియోపోరోసిస్ సమస్యను నివారించడానికి దీనిని ఖచ్చితంగా తినే ఆహారంలో చేర్చుకోండి.
గుండెకు మేలు
కమలం గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండెపోటు, ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వృద్ధాప్యాన్ని నిరోధించే లక్షణాలు
మఖానా ఖీర్ అనేది శక్తినిచ్చే ఆహారం. ఇది రోజంతా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలను అందిస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..