డిసెంబర్ నెల ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో అన్ సీజన్‌గా పరిగణించబడేది. నిర్మాతలు ఈ నెలలో సినిమాలు విడుదల చేయడానికి వెనుకడుగు వేసేవారు. అయితే, గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డిసెంబర్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లను సృష్టించే నెలగా పేరొందింది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియన్ చిత్రాలు డిసెంబర్లో విడుదలవుతూ వందల కోట్ల రూపాయల వసూళ్లను సాధిస్తున్నాయి, దీంతో ఇది అత్యంత ఎదురుచూసే నెలగా మారింది.
మరిన్ని వీడియోల కోసం :
