
కిడ్నీలో రాళ్ళు పరిమాణం, ఆకారంలో మారుతూ ఉంటాయి. ఇసుక రేణువు అంత చిన్నవిగా లేదా గోల్ఫ్ బాల్ అంత పెద్దగా కూడా ఉండొచ్చు. మీ శరీరం నుండి కిడ్నీ రాయిని తొలగించకపోతే, అది పెరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు మూత్రపిండాలు రక్తం నుండి ఉప్పు, నీరు, పొటాషియం, ఆమ్లం, నైట్రోజన్ వంటి వ్యర్థ ఉత్పత్తులను ఫిల్టర్ చేయలేకపోతాయి. అప్పుడు ఈ పదార్థాలు పేరుకుపోయి మూత్రపిండాలలో స్ఫటికాలను ఏర్పరుస్తాయి. ఈ స్ఫటికాలు కిడ్నీ స్టోన్ అనే ఘన పదార్థంగా మారుతాయి.
మజ్జిగలో కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. తక్కువ కొవ్వు ఉన్న మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు భోజనానికి ముందు మజ్జిగ తాగడం చాలా ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు.
భోజనానికి ముందు మజ్జిగ తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు విచ్ఛిన్నమై శరీరం నుండి బయటకు పోతాయి. కానీ మజ్జిగలో చిటికెడు ఇంగువా కలుపుకుని తీసుకుంటే అనుకున్న ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంగువను మజ్జిగలో కలిపి తాగితే, ఎంత పెద్ద కిడ్నీ రాయి అయినా అది విరిగిపోయి మూత్రం ద్వారా బయటకు వెళుతుంది. ఈ పానీయం మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఉత్తమమైనదిగా నిపుణులు చెబుతున్నారు.
భోజనం తర్వాత చిటికెడు ఇంగువను మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. తొందరగా జీర్ణమవుతుంది. కడుపులో ఏర్పడే అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడానికి మజ్జిగ సహాయపడుతుంది. ఈ సమస్యలతో బాధపడేవారు మజ్జిగలో జీలకర్ర, ఇంగువ, సైంధవ లవణం కలిపి తీసుకున్నట్లయితే ఉదర సమస్యలు తగ్గుతాయి. అలాగే పరగడుపున మజ్జిగ తాగితే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.