జూన్ 27న రిలీజైన ఈ మూవీ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా, ఈ చిత్రంలోని ప్రభాస్, విష్ణు, మోహన్ బాబు నటన చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో, ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇక.. అకార్డింగ్ టూ ఇంటర్నల్ న్యూస్…. కన్నప్ప మూవీ డే1.. రూ.20 కోట్లు వసూలు చేయగా, తాజాగా మూడవ రోజు..రూ.7.25 కోట్లు వసూలు చేసింది. అయితే శనివారం కంటే ఆదివారం అంటే జూన్ 29 ఒక్కరోజే భారీగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో కన్నప్ప సినిమా మొత్తం మీద 39.93% ఆక్యుపెన్సీని సాధించినట్టైంది. కన్నప్ప, కుబేర చిత్రాలు వారం రోజుల వ్యవధిలోనే ఆడియన్స్ ముందుకు రాగా, ఈ రెండూ మంచి కలెక్షన్లు రాబట్టాయి. విడుదలైన మొదటి మూడు రోజుల ప్రదర్శనతో పోల్చి చూస్తే, కుబేర సినిమా రూ. 48.6 కోట్లు వసూలు చేయగా, కన్నప్ప రూ. 23.75 కోట్లు రాబట్టింది. దీంతో ఇండస్ట్రీ ప్రముఖులంతా ప్రస్తుతం కన్నప్ప టీమ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, ఆర్. శరత్‌కుమార్, అర్పిత్ రాంకా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, శివ బాలాజీ, కౌశల్ మందా, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముఖేష్ రిషి,రఘుబాబు నటించారు. ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెట్టింట లీకైన కన్నప్ప మూవీ.. ఎమోషనల్ అయిన విష్ణు
