
ట్రయల్ రన్ సఫలంగా జరిగిందని అధికారులు తెలిపారు. అయితే ఇగత్పురి, కసారా మధ్య ఉండే నెట్వర్క్ లేని ప్రాంతంలో ముఖ్యంగా సొరంగాల వల్ల కొన్నిసార్లు సిగ్నల్ పోవడం మాత్రమే ఒక చిన్న సమస్య అన్నారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు రైల్లో ఏటీఎం అందుబాటులోకి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఏసీ కోచ్‌లో దీన్ని ఏర్పాటు చేసినప్పటికీ రైళ్లలో 22 బోగీల్లోనూ అందరికీ కనిపించేలా అనుసంధానం చేశారు. ఈ ఏటీఎం సేవలు ప్రజాదరణ పొందితే ఇతర ముఖ్యమైన రైళ్లలో కూడా ఈ సదుపాయం విస్తరించే అవకాశం ఉంది. భద్రత పరంగా ఏటీఎం కియోస్క్ ను అవసరమైనప్పుడు మూసివేయొచ్చు. అలాగే 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణలో ఉంటుంది. గుసావల్ డివిజన్ రైల్వే మేనేజర్ ఐటీ పాండే మాట్లాడుతూ ట్రయల్ రన్లో మంచి రిజల్ట్స్ వచ్చాయని ఇక ప్రయాణికులు కదులుతున్న రైల్లో నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ఏటీఎం పనితీరును నిరంతరం పరిశీలిస్తూనే ఉంటామని చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం :