
టాలీవుడ్ సీనియర్ నటి శ్రియా శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అతి కొద్ది సమయంలో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగు స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు వరస సినిమాలతో టాలీవుడ్ నే షేక్ చేసింది ఈ చిన్నది. తర్వాత వివాహం, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
మళ్లీ సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే పలు సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. ఇక సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ తన గ్లామర్ ఫొటోలతో సందడి చేస్తుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ డ్రెస్ లో అందాలతో మాయ చేసింది. పచ్చని చెట్ల మధ్య గులాబీ రంగు డ్రెస్ లోగ్లామర్ ట్రీ ట్ ఇస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ చిన్నది. ఎక్కువగా తన ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తూ ఉండేది. కానీ ఈ మధ్య గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. వీటిని చూసిన ఈ అమ్మడు అభిమానులు, బ్యూటిపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.