
అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తమిళంలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
వరల్డ్ ఫేమస్ లవ్, కౌసల్య కృష్ణ మూర్తి, మిస్ మ్యాచ్, రిపబ్లిక్ వంటి పలు సినిమాల్లో సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ నటి తెలుగులో రాంబంటూ సినిమాలో బాల నటిగా కూడా చేసింది.
అయితే ఏ సినిమా చేసినా రాని ఫేమ్ ఈ బ్యూటీకి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో వచ్చిందనే చెప్పాలి. ఈ మూవీలో వెంకటేష్ భార్యగా, ముగ్గురు పిల్లల తల్లిగా, సామాన్య గృహిణిగా తన పాత్రలో లీనమై నటించి, మంచి ప్రశంసలు అందుకుంది.
ఈ మూవీ తర్వాత ఐశ్వర్యా క్రేజ్ బాగా పెరిగింది. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ నటి కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. తన అంద చందాలతో వారిని మాయ చేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ మెరూన్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో కొంటెగా చూస్తూ… తన అందంతో పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.