ఆంధ్ర ప్రదేశ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 76వ రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు రావడం జరిగింది. ఈయనతో పాటు సహా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ నజీర్ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు.
