ఇరాన్‌కు తొలి టార్గెట్ ఖతారే అవుతుందన్న ఆందోళనల నేపథ్యంలో అక్కడి నుంచి బేస్‌ను ఖాళీ చేస్తోంది అమెరికా. అంటే.. నేడో రేపో ఇరాన్‌పై దాడులు ఉండొచ్చనేది స్పష్టమవుతోంది. ఇరాన్లో భారీ స్థాయిలో హింస కనిపిస్తోంది. నార్వే మానవహక్కుల సంస్థ ఇరాన్ అల్లర్లను నిశితంగా పరిశీలిస్తోంది. 18 రోజుల అల్లర్లలో 14 రోజుల డేటాను విడుదల చేసింది. 3వేల 428 మంది చనిపోయినట్లు ప్రకటించింది. అయితే అనధికారికంగా ఇరాన్లో 20 వేల మంది వరకు చనిపోయి ఉండొచ్చన్న అంచనాలున్నాయి. నిరసనలు ఎక్కడ కనిపించినా.. భారీ మెషీన్గన్లతో కాల్పులు జరుపుతున్నాయి ఇరాన్ బలగాలు. సోవియట్ కాలంనాటి 12.7 ఎంఎం బులెట్లు కలిగిఉన్న మెషీన్ గన్లను వాడుతోంది ఇరాన్ ఆర్మీ. చాలామంది నిరసనకారులు ఇస్లామిక్ రెజీమ్‌కు వ్యతిరేకంగా వారు కట్టించిన ప్రార్థనా స్థలాలను కూల్చేస్తున్నారు. దీంతో సొంత ప్రజలను పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతోంది. ఇది ఆగకపోతే ఇరాన్‌ను దేవుడు కూడా కాపాడలేడని చెబుతోంది. అయితే ఇరాన్లో జరుగుతున్న హింస బయటకు రావొద్దన్న కారణాలతో వారం రోజులుగా ఇంటర్నెట్ను నిలిపివేసింది అక్కడి ప్రభుత్వం. నిరసనలు ఎక్కడ జరిగినా.. పవర్‌కట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం
