
గడ్డకట్టే చలినుంచి తమను తాము రక్షించుకోడానికి ఓ 6 నెలలు పాటు గార్టర్ పాములు ఏకంగా 75 వేలకు పైగా అక్కడికి వచ్చి చేరతాయి. ఉష్టోగ్రతలు మామూలు స్థితికి వచ్చే వరకు లోపలే ఉండి.. ఆ తర్వాత తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్లిపోతాయి. ఇక్కడ రెడ్ సైడెడ్ గార్టర్ పాములు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. సాధారణంగా ఇవి మనుషులతో ఇతర జంతువులతో ఎంతో అన్యోన్యంగా ఉంటాయి. ఈ పాములకు విషం ఉండదు. అందుకే చాలామంది వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు. నార్సిస్ పాముల గుహలకు మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉంది. 450 మిలియన్ ఏళ్ల క్రితం ఆ ప్రాంతం సముద్రపు నీటితో నిండి ఉండేది. చాలా రకాల సముద్ర జీవులు అక్కడ జీవించేవి. తర్వాతి కాలంలో కాల్షియం కార్బనేట్ను నీళ్లు పీల్చుకోవటం వల్ల గుహలు ఏర్పడ్డాయి. ఆ గుహలు కొన్ని మీటర్ల లోతు వరకు ఉన్నాయి. ఇక, ఈ పాములను చూడ్డానికి జనం కూడా అక్కడకు వెళతారు. ఏప్రిల్, మే నెలలో పెద్ద సంఖ్యలో జనం అక్కడ పర్యటిస్తూ ఉంటారు. అక్కడ పెద్ద సంఖ్యలో ఉండే రెడ్ సైడెడ్ స్నేక్స్‌కు విషం ఉండదు కాబట్టి.. పర్యాటకులు వాటిని పట్టుకుని ఆడుకుంటూ ఉంటారు.
మరిన్ని వీడియోల కోసం
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్ వీడియో