

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు నాని. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు నాని. వాల్ పోస్టర్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు నాని. ఇటీవలే కోర్ట్ సినిమాను నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు నాని హీరోగా రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం నాని నటిస్తున్న హిట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు శైలేష్ దర్శకత్వం వహించారు.
ఇప్పటికే హిట్ ప్రాంచేజ్ లో హిట్, హిట్ 2 సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సిరీస్ లో హిట్ 3 రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు నాని. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా తన అభిమాన హీరోయిన్ గురించి చెప్పారు నాని.
నాని మాట్లాడుతూ.. నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం అని తెలిపాడు నాని. శ్రీదేవిని నేను ఎంతగానో ఆరాధించా.. శ్రీదేవి, వెంకటేష్ నటించిన క్షణక్షణం సినిమా ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు అన్నారు నాని. లక్షసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించే సినిమా అది. అసలు శ్రీదేవి అంత అందంగా ఉన్నారో ఇప్పటికీ నాకు అర్ధంకావడం లేదు.. ఆ సినిమాకే శ్రీదేవి అందం తీసుకొచ్చారు అని అన్నారు. అలాగే హిట్ 3తోపాటు రైడ్ 2 సినిమా కూడా ఒకేసారి విడుదలవుతున్నాయి. పోటీ తప్పదా అన్న ప్రశ్నకు .. నాని ఆసక్తికర సమాధానం ఇచ్చారు.. రైడ్ 2 సినిమాకు ప్రాధాన్యత ఇవ్వండి. వీలుంటే హిట్3 థియేటర్స్ లో చూడండి. అజయ్ సార్ తో నాకు పోటీ లేదు అని అన్నారు నాని. హిట్ 3’. మే 1న గ్రాండ్ గా విడుదలకానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి