
చాలా మంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా మాయమవుతుంటారు. చేసింది కొన్ని సినిమాలే అయినా తమ మార్క్ ను వదిలి వెళ్తుంటారు కొంతమంది. ఇంకొంతమంది ప్రేక్షకులు దాదాపు మర్చిపోయి ఉంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా..? ఎన్టీఆర్ తో కలిసి నటించింది ఈ భామ. ఎన్టీఆర్ కెరీర్ లో హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో శక్తి సినిమా ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. శక్తి సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో ఎన్టీఆర్ భార్యగా కనిపించింది ఈ చిన్నది. ఆమె మరెవరో కాదు ఆమె పేరు మంజరి ఫెడ్నస్.
అల్లరి నరేష్ నటించిన సిద్దూ ఫ్రేం శ్రీకాకుళం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆతర్వాత మరోసారి అల్లరి నరేష్ తో కలిసి శుభ ప్రదం అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను మెప్పించింది. కళాతపస్వి కే విశ్వనాద్ తెరకెక్కించిన చివరి సినిమా ఇది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ మంజరి తన నటనతో అలరించింది.
ఆతర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలో కనిపించింది మంజరి. ఆ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే టాలీవుడ్ లో పాగా వేసేదే ఈ బ్యూటీ.. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. మరాఠి , హిందీ సినిమాలతో బిజీగా మారిపోయింది ఈచిన్నది. హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందా.? అని చాలా మంది నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఈ క్రమంలో మంజరి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ అమ్మడు ఇప్పుడు చాలా మారిపోయింది. సడన్ గా చూస్తే గుర్తు పట్టడం కష్టమే.. అమ్మబాబోయ్ అందాలతో మతిపోగొడుతోంది ఈ బ్యూటీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.