
ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేదు షుగర్ వ్యాధిని పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే డయాబెటిస్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. లక్షలాది మంది దీనితో బాధపడుతున్నారు. ఇది శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్లో మార్పులు చెందుతాయి. కనుక షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మందులతో పాటు, జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం వలన మధుమేహాన్ని చాలా వరకు నిర్వహించవచ్చు. భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర లెవెల్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి ఒకే చోట ఎక్కువసేపు కూర్చున్నప్పుడు లేదా ఎటువంటి శారీరక శ్రమ చేయనప్పుడు. తేలికపాటి యోగా ఆసనాలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
యోగా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడటమే కాదు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ అయితే.. భోజనం చేసిన తర్వాత శరీరంలోని రక్తంలో చక్కెర లెవెల్స్ ను నిర్వహించాలనుకుంటే కొన్ని సులభమైన, ప్రభావవంతమైన యోగా ఆసనాలు ప్రయత్నించండి.
ఇవి కూడా చదవండి
జీర్ణవ్యవస్థను బలపరురిచే వజ్రాసనం
ముందుగా మోకాళ్లను వంచి నేలపై కూర్చోండి. వెన్నెముకను నిటారుగా ఉంచి చేతులను మోకాళ్లపై ఉంచండి. దీర్ఘంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా గాలిని వదిలాలి. ఈ స్థితిలో కనీసం 5-10 నిమిషాలు కూర్చోవాలి. ఈ ఆసనం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అంతేకాదు వజ్రాసనం అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి కడుపు సమస్యలను కూడా తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
ఒత్తిడిని తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరిచే సుఖాసనం
ముందుగా నేలపై చాప పరిచి.. కాళ్ళు చాపి కూర్చోండి. వీపును నిటారుగా ఉంచి చేతులను మోకాళ్లపై ఉంచండి. దీని తర్వాత కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఈ భంగిమలో కనీసం 5-10 నిమిషాలు కూర్చోండి. ఈ ఆసనం తిన్న తర్వాత చేయడం వలన శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్ ను అదుపులో ఉంచుతుంది.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
కడుపు సమస్యలను తొలగించే పవనముక్తాసనం
నేలపై వెల్లకిలా పడుకుని రెండు కాళ్ళను నిటారుగా ఉంచండి. ఇప్పుడు కుడి కాలును ఎత్తి.. దానిని వంచి మోకాళ్ళను ఛాతీ వైపుకు తీసుకువచ్చి, చేతులతో పట్టుకోండి. నెమ్మదిగా తలను పైకెత్తి మోకాలిని ముక్కుకు తాకడానికి ప్రయత్నించండి. కొన్ని సెకన్ల పాటు ఇలాంటి స్థితిలో ఉండి ఆపై సాధారణ స్థితికి తిరిగి రండి. తర్వాత ఎడమ కాలుతో కూడా ఇదే విధంగా చేయాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి సమస్యలు తగ్గుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
రక్తంలో చక్కెరను నియంత్రించడానికి అర్ధ మత్స్యేంద్రసనం
నేలపై కూర్చుని, రెండు కాళ్లను ముందుకు నిటారుగా ఉంచండి. కుడి కాలును వంచి ఎడమ మోకాలిపై ఉంచండి. తరువాత ఎడమ చేతిని కుడి మోకాలిపై ఉంచి, కుడి చేతిని వెనుకకు కదిలించండి. దీని తరువాత, నెమ్మదిగా తలను కుడి వైపుకు తిప్పి కొన్ని సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండండి. ఇప్పుడు దీన్ని మరొక దిశలో పునరావృతం చేయాలి. ఈ ఆసనం రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. శరీరాన్ని డీటాక్స్ చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు కడుపు, వెన్నెముకను కూడా బలపరుస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)