టాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు ఎల్దండి. ఎన్నో హిట్ చిత్రాల్లో తన నటనతో నవ్వించిన వేణు.. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో మరింత ఫేమస్ అయ్యాడు. అటు సినిమాలు.. ఇటు కామెడీ షోలతో అలరించిన వేణు.. దర్శకుడిగానూ సక్సెస్ అయ్యాడు. దాదాపు మూడేళ్ల క్రితం బలగం సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఊహించని స్థాయిలో హిట్టైంది. ఇక ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత ఎల్లమ్మ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న సినిమా ఎల్లమ్మ. ఆయన నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. ముందు నుంచి ఈ మూవీపై మంచి క్యూరియాసిటీ నెలకొంది. ఇందులో దేవి శ్రీ ప్రసాద్ డప్పు కళాకారుడు పర్షి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ అదిరిపోయింది. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరేలెవల్ అని చెప్పాలి.
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
ఓవైపు గొర్రెను చూపిస్తూ.. మరోవైపు గజ్జలు కట్టిన కాళ్లు పరుగులు పెడుతుంటే. మరోవైపు బూట్లు వేసుకున్న కాళ్లు పరుగులు పెడుతున్నట్లు చూపించారు. చివర్లో దేవి శ్రీ ప్రసాద్ డప్పును భూజాలకు వేసుకుని కూర్చొన్నట్లు చూపించారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ మూవీని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విడుదల తేదీతోపాటు మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
