
యమమా ఎఫ్ జెడ్ – ఎస్ ఎఫ్ఐ పేరుతో తయారు చేసిన ఈ బైక్ ధరను రూ.1.44,800లుగా నిర్దారించింది. నవీకరించిన ఈ బైక్ లోని ఐదు ప్రత్యేకతలను తెలుసుకుందాం. ఎఫ్ జెడ్ – ఎస్ ఎఫ్ఐ హైబ్రిడ్ బైక్ సొగసైన డిజైన్ తో మార్కెట్ లోకి విడుదలైంది. ముఖ్యంగా ట్యాంక్ కవర్ కొత్త రకం అంచులతో కనిపిస్తోంది. మోటారు సైకిల్ కు నూతన అందం తీసుకువస్తోంది. ముందువైపు టర్న్ సిగ్నల్స్ ను ట్యాంకు ముందు భాగంలో అమర్చారు. హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ మోటారు సైకిల్ లో 149 సీసీ బ్లూకోర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఓబీడీ 2బీ ప్రమాణాలను అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ20 కంప్లైంట్ పవర్ ట్రైన్ యూనిట్ నుంచి 7250 ఆర్పీఎం వద్ద 12.2 బీహెచ్ పీ శక్తి, 5500 ఆర్పీఎం వద్ద 13.3 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. స్మార్ట్ మోటారు జనరేటర్ (ఎస్ఎంజీ), స్టాప్, స్టార్ట్ సిస్టమ్ (ఎస్ఎస్ఎస్) సాంకేతికతలో ఇంజిన్ తయారు చేశారు.
4.2 అంగుళాల టీఎఫ్టీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ వై కనెక్ట్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్లకు చక్కగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ మ్యాప్స్ ద్వారా టర్న్ బై టర్న్ (టీబీటీ) నావిగేషన్ ను అందిస్తుంది. రియల్ టైమ్ దిశలు, ఖండన వివరాలు, రోడ్డు పేర్లు తెలుసుకోవచ్చు. తద్వారా రైడింగ్ చాలా సులభంగా మారుతుంది. దూర ప్రాంతాలకు రైడింగ్ కు వెళ్లినప్పుడు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా హ్యాండిల్ బార్ పొజిషన్ చక్కగా సరిపోతుంది. బార్ పై ఉన్న స్విచ్ లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. గ్లోవ్స్ ధరించినప్పుడు కూడా ఆపరేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. అలాగే రైడర్ల సౌలభ్యం కోసం హార్న్ స్విచ్ లను మార్చారు
కొత్త యమమా బైక్ కొలతల విషయానికి వస్తే 2000 ఎంఎం పొడవు, 780 ఎంఎం వెడల్పు, 1080 ఎంఎం ఎత్తు, 1330 ఎంఎం వీల్ బేస్ తో ఆకట్టుకుంటోంది. నేల నుంచి దాదాపు 163 ఎంఎం గ్రైండ్ క్లియరెన్స్ ఉంది. ఇక సీటు ఎత్తు 790 ఎంఎం. అలాగే రేసింగ్ బ్లూ, సియాన్ మోటాలిక్ గ్రే అనే రెండు రంగుల్లో ఈ బైక్ ను తీసుకువచ్చారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి