
70 ఏళ్లలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారతదేశం, 7-8 ఏళ్లలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. వారు కొత్త మధ్యతరగతిలో భాగమయ్యారన్న ప్రధాని, అతను కొత్త కలలతో ముందుకు సాగుతున్నారన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం(మార్చి 28) ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ అనే సమావేశంలో ప్రసంగించారు. టీవీ9 న్యూస్ నెట్వర్క్ పురోగతి, విస్తరణకు ప్రధానమంత్రి అందరికీ అభినందనలు తెలిపారు. టీవీ9 ను ప్రశంసిస్తూ, ప్రధాని మోదీ, టీవీ9 ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను సృష్టిస్తోందని అన్నారు.
భారతదేశం స్వావలంబన దిశగా తీసుకుంటున్న చర్యలను ప్రధాని ప్రస్తావించారు. గత పదేళ్లలో భారతదేశం ప్రతి రంగంలోనూ మారిపోయిందన్నారు ప్రధాని. ఆలోచనలో అతిపెద్ద మార్పు వచ్చింది. గతంలో, మీరు ఏదైనా కొనడానికి దుకాణానికి వెళితే, దుకాణదారుడు కూడా విదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అతను ప్రజలకు అదే వస్తువులను అందించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. నేడు వినినయోగదారులు ఇది మేడ్ ఇన్ ఇండియానా కాదా అని అడుగుతున్నారు. భారతదేశం మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా MRI యంత్రాన్ని కూడా తయారు చేసింది. స్వావలంబన ప్రచారం భారతదేశానికి శక్తినిచ్చిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా చూడటం గురించి ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించారు. నేడు భారతదేశం ప్రపంచ టెలికాం, నెట్వర్కింగ్ పరిశ్రమకు శక్తి కేంద్రంగా మారుతోందన్నారు. గతంలో భారీ మొత్తంలో మోటార్ సైకిల్ విడిభాగాలను దిగుమతి చేసుకునేవాళ్ళం. కానీ ప్రస్తుతం మనమే వాటిని ఎగుమతి చేయడం ప్రారంభించాం. సౌర మాడ్యూళ్ల దిగుమతి తగ్గింది. ఎగుమతి పెరిగింది. దేశం అన్ని విధాలుగా దూసుకుపోతుందన్నారు. మనం ఇక్కడ ఏమి ఆలోచిస్తామో, అదే రేపు మన భవిష్యత్తును సృష్టిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
గతంలో పుట్టని 10 కోట్లకు పైగా నకిలీ లబ్ధిదారుల పేర్లను వివిధ పథకాలలో చేర్చారని, వాటిని ఇప్పుడు తొలగించామని ప్రధాని మోదీ అన్నారు. ప్రభుత్వం పన్ను వ్యవస్థను సరళీకరించిందన్నారు. ఆదాయపు పన్ను దాఖలును కూడా సులభతరం చేసామని, దీంతో పాటు, ప్రధానమంత్రి మోదీ ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన అనేక ఇతర విజయాలను వివరించారు. భారత్ మండపంలో శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడం ద్వారా టీవీ9 పాత సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే కాలంలో, మరిన్ని మీడియా సంస్థలు ఈ మార్గాన్ని అవలంబించాలని ప్రధాని మోదీ సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..