
దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ 2025’ మూడో ఎడిషన్ రెండో రోజు ప్రారంభమైంది.. అంతర్జాతీయ స్థాయిలోనే నెవ్వర్ బిఫోర్ ఈవెంట్‌ను టీవీ9 నెట్వర్క్ ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తోంది.. వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ చివరి రోజు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఈ సమ్మిట్‌లో భాగంగా ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. భారతదేశంలో సౌత్ , నార్త్ రాజకీయాల గురించి మాట్లాడనున్నారు. ఈ రోజు జరిగే కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి పియూష్ గోయల్, బీహార్‌కు చెందిన ప్రముఖ నాయకుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ధీరేంద్ర శాస్త్రి సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.