
దాదాపు చాలా మంది ఉల్లిపాయలు పెద్ద మొత్తంలో మార్కెట్లో కొనుగోలు చేసి వంట గదుల్లో నిల్వ చేస్తుంటారు. ఉల్లి ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే మార్కెట్లో తెల్ల, ఎర్రని రంగుల్లో ఉల్లి కనిపిస్తుంటాయి. వీటిల్లో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు. చాలా మంది తెల్ల ఉల్లిపాయలను కొనడానికి ఇష్టపడరు. నిజానికి, ఎరుపు, తెలుపు ఉల్లిపాయలు రెండింటిలో రుచి, పోషకాల మధ్య చాలా తేడా ఉంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
తెల్ల ఉల్లిపాయ, ఎర్ర ఉల్లిపాయల మధ్య వ్యత్యాసం ఏంటంటే?
రంగు, ఆకృతిలో మార్పు
ఎర్ర ఉల్లిపాయల లోపలి భాగం లేత గులాబీ రంగులో ఉంటుంది. ఇక తెల్ల ఉల్లిపాయ బయటి భాగం లేత తెలుపు రంగులో ఉంటుంది. లోపలి భాగం పూర్తిగా తెల్లగా ఉంటుంది.
రుచి
ఎర్ర ఉల్లిపాయ రుచి కొద్దిగా ఘాటుగా, కారంగా ఉంటుంది. అందుకే దీనిని సాధారణంగా సలాడ్లు, వంటలలో ఉపయోగిస్తారు. అలాగే, తెల్ల ఉల్లిపాయ రుచి కొద్దిగా తీపిగా ఉంటుంది. దీనిని సూప్‌లు, శాండ్‌విచ్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఇవి కూడా చదవండి
నీరు, చక్కెర కంటెంట్
ఎర్ర ఉల్లిపాయలో నీటి శాతం తక్కువగా ఉంటుంది. ఇది రుచిగా ఉంటుంది. చక్కెర శాతం కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎర్ర ఉల్లిపాయ కంటే తెల్ల ఉల్లిపాయలో ఎక్కువ నీరు, చక్కెర శాతం అధికంటా ఉంటుంది. అందుకే ఎర్ర ఉల్లిపాయల కంటే తియ్యగా ఉంటుంది.
ఆహారంలో తేడాలు
చాలామంది ఎర్ర ఉల్లిపాయలను పచ్చిగా తింటారు. దీన్ని ఉడికించి కూడా తినవచ్చు. ఇది సాధారణంగా గ్రేవీలు, సలాడ్లు, ఊరగాయలలో ఉపయోగిస్తారు. తెల్ల ఉల్లిపాయలను ఎక్కువగా తేలికపాటి సూప్‌లలో ఉపయోగిస్తారు.
ఎర్ర ఉల్లిపాయల ప్రయోజనాలు
- ఎర్ర ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
- ఎర్ర ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేసి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
- ఈ రంగు ఉల్లిపాయలో విటమిన్ సి, సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
- ఎర్ర ఉల్లిపాయ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.
తెల్ల ఉల్లిపాయల ప్రయోజనాలు
- తెల్ల ఉల్లిపాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం, ఎసిడిటీ వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- తెల్ల ఉల్లిపాయ ఎముకలకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం, ఫాస్పరస్ ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.
- తెల్ల ఉల్లిపాయ చర్మం, జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ రసం చర్మాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
- తెల్ల ఉల్లిపాయల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఏది ఆరోగ్యానికి మంచిదంటే?
ఎర్ర ఉల్లిపాయల్లో యాంటీఆక్సిడెంట్, రోగనిరోధక శక్తిని పెంచే రక్త శుద్ధిగా ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని పచ్చిగా, ఏదైనా వంటకం లేదా సలాడ్‌లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది. ఇక తెల్ల ఉల్లిపాయలు జీర్ణక్రియకు, ఎముకల బలానికి, చర్మం, జుట్టు సంరక్షణకు తెల్ల ఉల్లిపాయలు మరింత మేలు చేస్తాయి. దీనిని సూప్‌లు, తేలికపాటి వంటలలో కలపవచ్చు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.