
ఇప్పుడు చాలామంది యువతలు జుట్టు రాలడం, తెల్ల జుట్టు వంటి సమస్యలు రావడం సర్వసాధారణం అయిపోయింది. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం వల్ల యువత అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కొంతమందిలో తెల్ల జుట్టుతో పాటు ఎక్కువగా చుండ్రు వంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. తెల్లజుట్టు సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్లో లభించే హెయిర్ డైస్కి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ కింది వాటిని వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా చేస్తాయి. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మూలికల్లో భృంగరాజ్ అతి ముఖ్యమైనది.
జుట్టు సమస్యలు ఏవైనా భృంగరాజ్ మొక్కతో సులభంగా పరిష్కరించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. భృంగరాజ్ మొక్కతో జుట్టుకు సంబంధించిన ప్రతి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో లభించే ఆయుర్వేద గుణాలు జుట్టును శక్తివంతంగా తయారు చేస్తాయి. భృంగరాజ్ మొక్కతో తయారుచేసిన మిశ్రమాన్ని జుట్టుకు మర్దన చేసి దాదాపు 30 నిమిషాల పాటు అలాగే పట్టించి.. నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టు సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
ముఖ్యంగా ఈ మిశ్రమాన్ని తెల్ల జుట్టుతో బాధపడుతున్న వారు వినియోగించడం వల్ల వారాల్లోనే ఆ సమస్య నుంచి విముక్తి పొందుతారు. భృంగరాజ్ మిశ్రమాన్ని జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వినియోగించవచ్చు. భృంగరాజ్ ఆకులతో తయారుచేసిన నూనెను తెల్ల జుట్టు ఉన్నవారు అప్లై చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు.
జుట్టు పల్చబడడం, చుండ్రును నివారించేందుకు కూడా ఈ నూనె ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి అన్ని రకాల జుట్టు సమస్యలు ఉన్నవారు భృంగరాజ్ ఆకులను వినియోగించవచ్చు.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..