
ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ప్రపంచ వ్యాప్తంగా నిత్యం 3.5 బిలియన్ల యూజర్లు వినియోగిస్తారని అంచనా. దీని ద్వారా వీడియో, ఆడియో కాల్స్ తో పాటు డేటాను కూడా పంపుతూ ఉంటారు. ఈ యాప్ లేని స్మార్ట్ ఫోన్ దాదాపు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో యాప్ లో తరచూ అనేక అప్ డేట్లు జరుగుతూ ఉంటాయి. యూజర్ల ఉపయోగం, రక్షణ కోసమే వీటిని తీసుకువస్తుంటారు. వాట్సాప్ బీటా ఇన్ఫో లో రాబోయే ఫీచర్ల వివరాలను వెల్లడించారు. ఆండ్రాయిడ్ వినియోగదారులు తాజా బీటా వెర్షన్ లో వీటిని పొందవచ్చు. ప్రస్తుతం పరిమిత యూజర్ల ద్వారా వాటిని పరీక్షిస్తున్నారు. వీటిలో ఇన్ కమింగ్ వాయిస్ కాల్స్ కోసం మ్యూట్ మైక్రో ఫోన్ ఎంపిక ఒకటి. ఈ ఫీచర్ నోటిఫికేషన్ ప్యానెల్ లో కనిపిస్తుంది. దీని ద్వారా యూజర్లు తమ మైక్రో ఫోన్ ను మ్యూట్ లో ఉంచుతూ కాల్స్ కు సమాధానం చెప్పవచ్చు.
వాట్సాప్ లో వీడియో కాల్స్ కు సంబంధించి రెండో ఫీచర్ ను తీసుకువచ్చారు. దీని ద్వారా వినియోగదారులు సమాధానం ఇవ్వడానికి ముందుగానే ఫోన్ కెమెరాను నిలిపివేసే అవకాశం కలుగుతుంది. కెమెరా ముందు కనిపించడానికి కొంత సమయం తీసుకోవాలనుకునే వారికి, అస్సలు కనిపించకుండా మాట్లాడాలనుకునే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. తెలియని కాలర్లతో మాట్లాడేటప్పుడు చాలా రక్షణగా ఉంటుంది. దీని ద్వారా వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు గోప్యతను పాటించవచ్చు. గతంలో వినియోగదారులు కాల్ తీసుకున్న తర్వాత కెమెరాను ఆఫ్ చేయాల్సి వచ్చేది.
వాట్సాప్ లో మూడో ఫీచర్ ఎమోజీలకు సంబంధించింది. వీడియో కాల్స్ సమయంలో ఎమోజీలను ఉపయోగించుకోవచ్చు. వీడియో కాల్స్ సమయంలో వినియోగదారులు రియల్ టైమ్ లో స్పందించడానికి అవకాశం కలుగుతుంది. సంభాషణల సమయంలో తేలికగా అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి