
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వారమంతా దాదాపు శుభ యోగాలతో సాగిపోతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయం నిలకడగా వృద్ది చెందుతుంది. కొన్ని ఆర్థిక, వ్యక్తిగత కష్టనష్టాల నుంచి బయట పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అధికారుల నుంచి ఆదరాభిమానాలు, ప్రోత్సాహాలు లభిస్తాయి. ప్రముఖులతో సన్నిహిత సంబం ధాలు ఏర్పడతాయి. పిల్లలు ఆశించిన విధంగా వృద్ధిలోకి వస్తారు. ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సానుకూల ఫలితానిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు తలపెడతారు. ఆరోగ్యానికి లోటుండదు. కొద్దిగా అనవసర ఖర్చులు పెరగడం, అనవసర పరిచయాలు ఏర్పడడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.