
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా మీ సేవలను ఉపయోగించుకుంటారు. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా కూడా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను సకాలం పూర్తి చేస్తారు. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు.