

సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది, దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొన్ని సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్‌లో, కోబ్రాను రక్షించిన తర్వాత, ఆ వ్యక్తి దాని తలను వెనుక నుండి ముద్దాడటానికి ప్రయత్నించగా, ఆ పాము వెనక్కి తిరిగి అతని పెదవులపై కాటు వేసింది. ఈ దృశ్యం ఒళ్లు గగుర్పాటుకు గురిచేసింది.
కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము అని అందరికి తెలసిందే. ఇది ఒకేసారి చాలా విషాన్ని ఉమ్మివేస్తుంది. దాని విషానికి 20 మంది చనిపోవచ్చు. కానీ దీని తరువాత కూడా, కొంతమంది ఈ ప్రమాదకరమైన పాముతో చెలగాటం ఆడటానికి వెనుకాడరు.
ఇప్పుడు ఈ వైరల్ వీడియో చూడండి.
View this post on Instagram
వైరల్ అవుతున్న ఈ వీడియోలో, నాగుపాముని రక్షించిన తర్వాత, దానిని సీసాలో బంధించడానికి బదులుగా, పాములు పట్టే వ్యక్తి దానిని ముద్దాడటానికి ప్రయత్నించాడు. కానీ ఆ మరుసటి క్షణంలోనే పాము వెనక్కి తిరిగి ఆ మనిషి ముఖంపై కాటు వేసింది.
వీడియోలో, పాము ఎంత చురుగ్గా దాడి చేస్తుందో మీరు చూడండి. ఆ మనిషి కూడా ఒక్కసారిగా షాకై వెనక్కి కదులుతాడు. అయితే, పాము అతన్ని కరిచిందా లేదా అనేది వీడియోలో స్పష్టంగా లేదు. వీడియో చూస్తుంటే అది భారతదేశంలోని ఏదో ఒక నగరంలో రికార్డ్ చేసినట్లు స్పష్టమవుతుంది. అయితే, ఖచ్చితమైన ప్రదేశం మాత్రం తెలియదు.
ఈ హృదయ విదారక వీడియోను @therealtarzann అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 25 వేల మంది లైక్ చేశారు. అయితే కామెంట్ సెక్షన్లో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతను బతికే ఉన్నాడా అని అడుగుతున్నారు.”నాగుపాము లాంటి ప్రమాదకరమైన పాములను తేలికగా తీసుకునే వారందరికీ ఇది ఒక గుణపాఠం” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. “ఇలాంటి తెలివితక్కువ పనులు చేయడం వల్ల జనాలకు ఏం లభిస్తుందో అర్థం కావడం లేదు” అని ఇంకో యూజర్ అన్నాడు. మరొక వినియోగదారుడు, కిస్ ఆఫ్ డెత్ అని రాశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..