
నడి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పడవలో శుక్రవారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అలీబాగ్ కోస్టల్ తీరానికి దాదాపు 6 నుంచి 7 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రాకేష్ గన్ కు చెందిన ఒక ఫిషింగ్ బోట్ అగ్నికి ఆహుతైంది. సమాచారం అందిన వెంటనే ఇండియన్ కోస్టల్ గార్డ్స్, నావికాదళం అప్రమత్తమయ్యారు. హుటాహుటీన ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని పడవలో ఉన్న 18 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించగలిగారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మునుముందు ఇలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సముద్ర భద్రతా సంస్థలను అప్రమత్తం చేశారు.
సఖర్ అక్షి గ్రామానికి చెందిన రాకేష్ మారుతి గన్‌కు చెందిన షిప్ మంటల్లో చిక్కుకుంది. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో అందులోని జాలరులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చేపల వలలతో సహా దాదాపు 80 శాతం షిప్ కాలిపోయింది. అదృష్టవశాత్తూ అందులో ఉన్న 18 మంది ప్రాణాలతో బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. స్థానిక మత్స్యకారులు, కోస్ట్ గార్డ్, నేవీ బోట్లు సమన్వయంతో చేసిన ప్రయత్నాలు మంటల్లో చిక్కుకున్న పడవను ఒడ్డుకు తీసుకురాగలిగారు. ప్రస్తుతం ఇంకా అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇవి కూడా చదవండి
मुंबई के पास अलीबाग में मछली पकड़ने वाली नाव में लगी आग, नाव में सवार 18 लोगों को बचाया गया #Mumbai #Alibag #BoatFire #Fire #Boat pic.twitter.com/zxXRXGVovN
— India TV (@indiatvnews) February 28, 2025
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.