
హమీర్పూర్, ఏప్రిల్ 8: హత్యాయత్నం కేసులో 19 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్‌లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అక్కడికి చేరుకోగానే టాయిలెట్‌కి వెళ్లాలని పోలీసులను కోరాడు. దీంతో పోలీసులు కూడా వెహికల్ దిగి అతడిని కూడా వ్యాన్ నుంచి కిందకు దించారు. అంతే కళ్లు మూసి తెరిచేలోగా పోలీసులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..
హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో పాత కక్షల కారణంగా ఒక వృద్ధుడ్ని హత్య చేసేందుకు కేశవ్ శర్మ (19) అనే యువకుడు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ ముందు ఆగిన తర్వాత నిందితుడు కేశవ్ శర్మ టాయిలెట్‌కు వెళ్లాలని పోలీసులను కోరాడు. ఓ పోలీస్ ముందుగా కిందికి దిగి డోర్ కూడా తెరిచి ఉంచాడు. అంతే అదే అదనుగా కేశవ్ ఒక్క ఉదుటున ఉడాయించాడు.
పోలీసులు ఏం జరిగిందో అర్ధం చేసుకునేలోపు మనోడు రోడ్డు దాటి చాలా దూరం వెళ్లిపోయాడు. దీంతో స్టేషన్‌లోని పోలీసులందరూ కేశవ్ వెంటపడ్డారు. మెయిన్ రోడ్డు వైపు పరుగులు తీస్తున్న కేవశ్ను పోలీసులు చేజ్ చేసి చివరకు పట్టుకోగలిగారు. ఈ సంఘటన మొత్తం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. టాయిలెట్ సాకుతో శర్మ పోలీసుల కస్టడీ నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మీమ్స్‌తో హల్చల్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.