
అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కొలరాడో రాష్ట్రంలో ఉన్న డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానంలో ల్యాండ్ అయిన వెంటనే మంటలు అంటుకున్నాయి. విమానాశ్రయం గేటు వద్ద ఆగిన విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ఎయిర్పోర్ట్, విమాన సిబ్బంది వెంటనే స్పందించారు. తక్షణమే అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. విమాన రెక్కపై నిలిచిన ప్రయాణికులను సిబ్బంది కిందకు దింపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారుల ప్రకారం, గేట్ C38 వద్ద ఆపి ఉంచిన విమానంలో మంటలు చెలరేగాయి. టార్మాక్ పైకి దట్టమైన నల్లటి పొగ ఎగసిపడింది. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు లేదా ప్రాణహాని జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. 172 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది విమానం నుండి సురక్షితంగా టెర్మినల్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
BREAKING: An American Airlines plane caught fire at Denver International Airport forcing passengers running.
Why does it seem like airline safety is plummeting under Trump? Maybe it’s because he’s making cuts to airline safety? pic.twitter.com/en9sK1hHuJ
— Ed Krassenstein (@EdKrassen) March 14, 2025
ఆ విమానం కొలరాడో స్ప్రింగ్స్ విమానాశ్రయం నుండి బయలుదేరి డల్లాస్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతోంది. కానీ దానిని DIAకి దారి మళ్లించారు. ఆ విమానానికి ఉపయోగించిన విమానం బోయింగ్ 737-800 అని అమెరికన్ ఎయిర్‌లైన్స్ నివేదించింది. వైరల్ అవుతున్న వీడియోల్లో విమానం చుట్టూ పొగలు కమ్ముకుంటుండగా, ప్రయాణీకులు విమానం రెక్కలపై నిలబడి ఉన్నట్లు చూపించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..