
టర్కీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టర్కీలోని స్కీయింగ్ రిసార్టు హోటల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో 66 మంది సజీవదహనమయ్యారు. పలువురు గాయపడినట్లు సమాచారం. హుటాహుటినా రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మంటల్లో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
12 అంతస్తుల హోటల్లోని నాల్గవ అంతస్తులో మంటలు చెలరేగాయని బోలు గవర్నర్ అబ్దుల్ అజీజ్ ఐడిన్ తెలిపారు. తెల్లవారుజామున 3:30 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 51 మందికి గాయాలైనట్లు మంత్రి అలీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
#BREAKING
A fire at a ski resort hotel in Bolu, Turkiye.At least 234 guests at #GrandKartal_Hotel in Kartalkaya in Bolu, Turkiye where the fire broke out, governor says. At least 10 dead, 32 injured. #Bolu #Kartalkaya #Turkiye #Firepic.twitter.com/rPlughyOWP
— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) January 21, 2025
హోటల్ జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో 234 మంది అతిథులు ఉన్నట్టుగా సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..