
లోక రక్షణ, రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో జన్మించాడని చెబుతారు. అలా త్రేతాయుగంలో మహా విష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముడు. దశరథ మహారాజు, కౌసల్య దేవి సంతానంగా శ్రీరాముడు నవమి తిథి రోజు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆనాడే సీతారాముల కళ్యాణం జరిగిందని చెబుతారు. 14 ఏళ్ల అరణ్యవాసం అనంరతం పట్టాభిషిక్తుడైన రోజు కూడా నవమి తిథిగా చెబుతారు. అందువల్ల శ్రీరామ నవమి రోజు సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఆ శ్రీరాముడి జన్మస్థలంగా పిలిచే అయోధ్యలో రాములవారి కళ్యాణం చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, అందరూ అక్కడికి వెళ్లలేరు. ఈ క్రమంలోనే ఏకంగా ఆ అయోధ్య రామ మందిరం మన హైదరాబాద్ కు కదిలి వచ్చింది.. ! అదేంటని ఆశ్చర్యపోతున్నారా.. ఈ వీడియో చూస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన కారు డెకరేషన్ సంస్థ అయోధ్య రామమందిరం ఆకారంలో రూపొందించిన కారు అందరినీ ఆకట్టుకుంటోంది. బహదూర్ పురా సధాకార్స్ మ్యూజియం యజమాని సుధాకర్ యాదవ్ తీర్చి దిద్దిన ఈ కారు అయోధ్య రామాలయ నమూనాను పోలి ఉండటంతో ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. గత సంవత్సరంమే ఈ అయోధ్య రామమందిరా కారును తయారు చేశారు.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
Ayodhya Ram Mandir on Wheels.., runs on the roads of #Hyderabad, ahead of Sri Rama Navami (#RamNavami )
This #Ayodhya #RamMandirCar was designed by #Hyderabadi car designer Sudhakar Yadav, who owns #SudhaCars museum, the unique ‘Wacky Car Museum’ displays that resemble everyday… pic.twitter.com/KBx0vFgr9q
— Surya Reddy (@jsuryareddy) April 5, 2025
22 ఫీట్ల పొడవు, 26 ఫీట్ల ఎత్తులో ఉండే ఈ వాహనం కదులుతుంటే అయోధ్య ఆలయం కదిలినట్లుగా కనిపిస్తుంది. అప్పట్లో ఈ వాహనం తయారీలో 10 మంది ముస్లిం కార్మికులు కూడా పాల్గొన్నట్టు సుధాకర్ యాదవ్ వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..