
ట్రైనింగ్‌లో భాగంగా ఆకాశంలో విన్యాసాలు చేస్తుండగా రెండు ఫైటర్ జెట్ విమానాలు గాలిలో ఢీకొట్టాయి. దీంతో ఒక విమానం అమాంతంగా కూలిపోయింది.. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అయితే పైలట్లు పారాచూట్ల సహాయంతో దూకేశారు. ప్రమాదంలో గాయపడిన వారు స్పృహతప్పినట్లు అధికారులు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్రాన్స్‌లోని సెయింట్ డైజియర్ ప్రాంతంలోని ఎయిర్ బేస్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రేనియన్ పైలట్లకు ఫ్రాన్స్ శిక్షణ నందిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 25న ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఆల్ఫా జెట్ విమానాలతో ట్రైనింగ్ జరిగింది. ఈ క్రమంలోనే గాలిలో విన్యాసాలు చేస్తుండగా, రెండు జెట్ విమానాలు ఢీకొన్నాయి. ఒక విమానం కూలిపోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఇద్దరు పైలట్లు, ఒక వ్యక్తి పారాచూట్ల సహాయంతో ఆ విమానం నుంచి బయటపడ్డారు.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
This is the moment two jets from the French air force’s acrobatics team collided mid-air, after a training exercise went wrong.
Both pilots and a passenger survived after ejecting the aircraft. pic.twitter.com/vGCKmm2oC0
— DW News (@dwnews) March 26, 2025
కానీ, వారు ఎత్తునుంచి కిందపడిన సమయంలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురు స్పృహతప్పినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని వెల్లడించారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..