
పాములకు సంబంధించిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో తరచూగా వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలో కొన్ని కొన్ని సార్లు పాములు ఇల్లు, బైకులు, కార్లలో దూరి ప్రజల్ని కంగారు పెట్టిస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇందులో ఒక పాము ఓ ఇంటి టాయిలెట్ కమోడ్ నుంచి భారీ నాగుపాము బయటకు వచ్చిన షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అయితే, ఈ సంఘటన జరిగింది విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో జరిగినట్టుగా తెలిసింది.
పెందుర్తిలోని ఓ ఇంటి వాష్ రూమ్ లో నాగుపాము నక్కింది. అదృష్టవశాత్తు కమోడ్ లో నక్కిన పామును చూసిన ఆ ఇంట్లోని వారు భయబ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్క్యాచర్కు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ నాగుపామును సురక్షితంగా బంధించి సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..