
యూపీలోని ఘాజీపూర్ నుండి ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇది రీల్స్ పిచ్చితో ప్రాణాలకు తెగించి స్టంట్లు చేసే వారిని మరోసారి అప్రమత్తం చేసింది. రీల్స్ మోజులో ఒళ్లు మర్చిపోయి రిస్క్‌లు చేస్తే.. మీరు మీ జీవితాన్ని కూడా కోల్పోవచ్చని ఈ వీడియో మనకు చెబుతుంది. సరిగ్గా ఇదే జరిగింది. ఇక్కడో వ్యక్తి ఈ-రిక్షా పైకప్పుపై నిలబడి డ్యాన్స్ వీడియో చేస్తుండగా కింద పడి మరణించాడు. ఈ సంఘటన గురువారం రాత్రి సిటీ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో జరిగింది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి తన ఇ-రిక్షా పైకప్పుపై నిలబడి డ్యాన్స్ చేస్తున్నాడు. రీక్షాపై డ్యాన్స్ ఇన్స్టాగ్రామ్ రీల్ తయారు చేయాలనుకున్నాడు. కానీ, అతని సరదా కాస్త విషధాంతంగా మారింది. అలా అతడు రిక్షాపై నిలబడి డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా పై నుండి కింద పడిపోయాడు. అలా పిడిన వెంటనే అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని తెలిసింది. అయినప్పటికీ స్థానికుల సాయంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే అతడు చనిపోయినట్టుగా వైద్యులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
మృతుడిని పోస్ట్ మార్టం హౌస్‌లో అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిన చంద్రశేఖర్‌గా గుర్తించారు. ఆ ప్రాంతవాసులు తలారి అని పిలుస్తారని తెలిసింది. అతని మరణ వార్త ఆ ప్రాంతమంతా దావానలంలా వ్యాపించింది. అతనికి రీల్స్ పిచ్చి బాగా ఎక్కువగా ఉండేదని, ఆ రీలే అతని జీవితంలో చివరి రీల్ అంటూ స్థానిక ప్రజలు తలారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అయితే, మరో యాదృచ్చికం ఏంటంటే.. చంద్రశేఖర్ పోస్ట్ మార్టం అతను పనిచేసిన మార్చురీలోనే జరిగింది.
వీడియో ఇక్కడ చూడండి..
UP के गाज़ीपुर मे रील्स के नशे ने एक व्यक्ति की सांसे छीन ली। पोस्टमार्टम हॉउस के आउट सोर्सिंग कर्मचारी चंद्रशेखर को इलाके मे ‘जल्लाद’ के नाम से जाना जाता था। सोशल मीडिया पर वह अलग अलग तरह की #reelsvideo अपलोड करके वाह वाही लूटता था। उसके जीवन की अंतिम रील्स #viralvideo हो गई..… pic.twitter.com/flAup7JK9l
— TRUE STORY (@TrueStoryUP) March 28, 2025
చంద్రశేఖర్ మద్యం తాగి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. అతను ఈ-రిక్షా పైన నిలబడి ఇన్స్టాగ్రామ్ రీల్ తయారు చేస్తున్నాడు. అతను పాటకు డ్యాన్స్ చేస్తుండగా అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి అమాంతంగా నేలపై పడిపోయాడు. అతను కింద పడగానే స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని ఎత్తుకుని ఆసుపత్రికి తరలించారు. కానీ కాపాడలేకపోయారు. అతను పోస్ట్ మార్టం నిర్వహించే గదిని శుభ్రం చేసే పని చేసేవాడని తెలిసింది. అతను వైద్యులకు ప్రతి పనిలోనూ సహాయం చేసేవాడని గుర్తుచేశారు. కాగా, అతనికి రెండు పెళ్లిళ్లు అయినట్టుగా తెలిసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..