
ట్రిపుల్ ఆర్ తర్వాత దేవరతో సక్సెస్ అందుకున్నారు తారక్. ఇప్పుడు వార్2 కూడా సూపర్ సక్సెస్ అయితే, ఇక ఆయన కెరీర్‌కి నార్త్ లోనూ తిరుగు ఉండదన్నది అందరూ యాక్సెప్ట్ చేసే విషయం. దీనికి తోడు వరుస లైనప్ కూడా ఊరిస్తోంది. సో, ప్రాజెక్ట్ సెలక్షన్ టు ప్రమోషన్ల వరకు.. ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా డీల్ చేయాలని తారక్ కి వెల్ విషర్స్ నుంచి సలహాలు అందుతున్నాయి.