
డ్రై ఫ్రూట్స్‌లో వాల్ నట్స్ కూడా ఒకటి. వాల్ నట్స్ తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. ఇవి తినేందుకు కాస్త చేధుగా ఉంటాయి. కానీ ఆరోగ్యాన్ని పెంచడంలో ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయి. వాల్ నట్స్ నానబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయ పడుతుంది. ఇందులో గుడ్ ఫ్యాట్స్, ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కేవలం ఆరోగ్యాన్నే కాకుండా.. అందాన్ని పెంచడంలో చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. మరి చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుపుదాం.
ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి స్కిన్‌ని హైడ్రేట్ చేసి, ఇన్ప్లమేషన్ని తగ్గిస్తుంది. ఈ ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా చర్మం త్వరగా పొడిబారదు. స్కిన్ త్వరగా పాడవకుండా చేస్తుంది.
వాల్ నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. చర్మాన్ని అందంగా మార్చడంలో హెల్ప్ చేస్తుంది. చర్మంపై మచ్చలు పడకుండా చేస్తుంది.
పింపుల్స్‌ని తగ్గించడంలో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. విటమిన్ ఇ చర్మానికి రక్షణగా నిలుస్తుంది. చర్మంపై త్వరగా ముడతలు పడకుండా చేస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)